స్కూళ్లు, హాస్పిటళ్లలో కలెక్టర్ల తనిఖీ : అద్వైత్ కుమార్ సింగ్

స్కూళ్లు, హాస్పిటళ్లలో కలెక్టర్ల తనిఖీ : అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: గార్ల పీహెచ్​సీ, పశు వైద్యశాల, హైస్కూల్​ను కలెక్టర్  అద్వైత్ కుమార్ సింగ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్స్​లో మందులు, రికార్డులను  పరిశీలించారు. స్కూల్లో విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలకు డిజిటల్​పాఠాలు బోధించాలని, పౌష్టికాహారం అందించాలని టీచర్లకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,  గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  

నల్లబెల్లి, వెలుగు: గుండ్లపహాడ్​, రుద్రగూడెం హైస్కూళ్లు, బోల్లనిపల్లి ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్​సత్యశారద గురువారం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో తెలుగు, ఇంగ్లిష్​పాఠాలు చదివించారు. ​అనంతరం యూరియా గోదాంలను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అనురాధ, తహసీల్దార్ కృష్ణ, ఎస్సై గోవర్ధన్ పాల్గొన్నారు.