రుచికరమైన భోజనం అందించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

రుచికరమైన భోజనం అందించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​ అన్నారు. సోమవారం ఆయన మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ (బాలికలు), గుమ్ముడూరులో మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహం పాఠశాల ఆవరణంలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, తరగతి గదులు, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. 

విద్యార్థులకు భోజనం సిద్ధం చేస్తున్న సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సీజనల్​వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అకాడమిక్ ప్రకారం స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఇన్​చార్జి డీసీవో జాక్లీన్ తదితరులున్నారు.