మహబూబ్​నగర్ జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. పాత, కొత్త లీడర్లు పంచాది

మహబూబ్​నగర్ జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..  పాత, కొత్త లీడర్లు పంచాది
  • ముగిసిన కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు
  • మండల అధ్యక్ష పోస్టుల కోసం ఒక్కో మండలం నుంచి ఐదారుగురు పోటీ
  • సమావేశాల్లో ప్రియారిటీ ఇవ్వడం లేదని కొందరు లీడర్లు అసంతృప్తి 
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్లకే గుర్తింపు ఇస్తామని హామీ

మహబూబ్​నగర్, వెలుగు: అధికార కాంగ్రెస్​ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.  ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా.. కొత్తగా పార్టీలో చేరిన వారికే ప్రియారిటీ ఇస్తున్నారని కొందరు లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలో గత రెండు వారాలుగా జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో  లీడర్లు ఈ విషయాలపై పార్టీ పెద్దల ముందు గోడు వెల్లబోసుకున్నారు. 

ప్రియారిటీ ఇవ్వడం లేదని..

కాంగ్రెస్​ హైకమాండ్​ సంస్థాగత పదవులను భర్తీ చేసేందుకు గత నెల ప్రత్యేకంగా సమావేశమైంది. ఇందులో భాగంగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో మండల అధ్యక్షులు, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్న వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని..  ప్రతి జిల్లాకు ఇద్దరు లీడర్లకు బాధ్యతలను అప్పగించింది. 

పాలమూరు జిల్లాకు టీ పీసీసీ అబ్జర్వర్లు సాంబయ్య, భాస్కర్​ యాదవ్​లను హైకమాండ్​ నియమించింది. వీరి ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం జిల్లా స్థాయి, ఇటీవల నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిశాయి. అయితే సమావేశాల్లో కొందరు లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.  కొందరు ఎమ్మెల్యేలు పాత, కొత్త లీడర్ల మధ్య పక్షపాతం చూయిస్తున్నారని ఆరోపించారు. పాత, కొత్త లీడర్ల మధ్య ఉన్న పంచాదులను సమావేశాల్లో తెరమీదకు తెచ్చినట్లు చర్చ జరుగుతోంది.  అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక  సీనియర్​ లీడర్లను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని..  కొత్తగా పార్టీలో చేరిన వారికే పదవులు ఇస్తున్నారని చెప్పినట్లు తెలిసింది.  ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ప్రియారిటీ ఇస్తేనే..  రానున్న లోకల్​ బాడీస్​ ఎన్నికల్లో అండగా నిలబడతామని స్పష్టం చేసినట్లు సమాచారం. 

ఎమ్మెల్యేలు ఎన్నికల వరకే రాజకీయాలు.. 

కొందరు ఎమ్మెల్యేలు ఓ సామాజిక వర్గానికి చెందిన లీడర్లనే వెంటేసుకొని తిరుగుతున్నారని.. దీని వల్ల చాలా మంది లీడర్లు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వారికి వివరించినట్లు తెలిసింది. సమావేశాలకు కొందరు సీనియర్​ లీడర్లు గైర్హాజరైనట్లు తెలియజేశారు. గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కేడర్​ను పక్కకు పెట్టలేదని.. వారికే మొదటి ప్రియార్టీ ఇచ్చే వారనే విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. 

తద్వారా వారు గత స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాల సాధించినట్లు అబ్జర్వర్లకు వివరించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఓ నియోజకవర్గ మీటింగ్​కు ముందు కొందరు లీడర్లు సంతకాల సేకరణ చేశారు. తమ మండల అధ్యక్షుడిని మార్చాలని.. ఆయనకు అండగా ఉన్న ఓ యువ నాయకుడు.. తమ మండలంలో పెత్తనం చెలాయిస్తున్నాడని సంతకాలు సేకరించి అబ్జర్వర్లకు అందించినట్లు తెలిసింది.

పాత వారికే ప్రియారిటీ ఇస్తామని ప్రకటనలు

సమావేశాల్లో పాత, కొత్త లీడర్ల మధ్య పంచాదులు తెరమీదకు వస్తుండటంతో.. కొందరు ఎమ్మెల్యేలు బుజ్జగింపుల ప్రయత్నాలకు తెరలేపారు.  ఓ ఎమ్మెల్యే తనకు అత్యంత సన్నిహితులైన వారిని రంగంలోకి దింపి.. సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన లీడర్ల వద్దకు పంపించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా.. పదేండ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన కేడర్​కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని కొందరు ఎమ్మెల్యేలు హామీలు ఇస్తున్నట్లు సమాచారం. కేడర్​ రెండుగా చీలిపోతే స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయని, తద్వారా పార్టీకి నష్టం జరుగుతుందనే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది.  ఫైనల్​గా పార్టీలో విభేదాలు వద్దు.. పాత వారికే ప్రియారిటీ ఇస్తామనే ప్రకటనలు చేసినట్లు సమాచారం.

ముగిసిన దరఖాస్తుల స్వీకరణ

జిల్లా, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిశాయి. అన్ని మండలాలకు నుంచి కేడర్​ సమావేశాల్లో పాల్గొంది. అయితే పార్టీ మండల అధ్యక్ష పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో మండలం నుంచి నలుగురైదుగురు పోటీ పడుతుండటం విశేషం. అయితే వీరిలో ఎవరిని ఫైనల్​ చేయాలనే దానిపై హై కమాండ్​ ఫోకస్​ పెట్టింది. ఇప్పటికే మండల అధ్యక్షులు, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్ష పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్​కు గాంధీభవన్​కు తరలించారు. అయితే తమకే అధ్యక్ష పదువులు వచ్చేలా చూడాలని కొందరు లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా.. ఈ నెలాఖరులోపు మండల, బ్లాక్​ కాంగ్రెస్​, డీసీసీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.