మహబూబ్​నగర్ జిల్లాలో.. బాలికలే టాప్​

 మహబూబ్​నగర్ జిల్లాలో.. బాలికలే టాప్​
  • పది  ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో  బాలికలే ఎక్కువ పాస్​ 
  • ప్రతిభ చూపిన సర్కార్​స్కూల్,  బీసీ వెల్ఫేర్ విద్యార్థులు 

 మహబూబ్​నగర్, వెలుగు : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలే ఎక్కువ మంది పాస్​ అయ్యారు.  ఫలితాల జాబితాలో ఐదు జిల్లాలు  15వ స్థానం తర్వాతే నిలిచాయి.  15 స్థానంలో నారాయణపేట జిల్లా రాగా.. 32వ స్థానంలో గద్వాల  నిలిచింది.    మహబూబ్​నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి  లో  బాలికలే  పైచేయి సాధించారు.  మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ ఏడాది 6,416 మంది బాయ్స్​, 6,257 మంది గర్ల్స్ తో కలిపి 12,673 మంది   పరీక్షలకు హాజరయ్యారు.

వీరిలో 89.47 శాతంతో 11,338 మంది పాస్​ అయ్యారు. బాయ్స్​ 5,604 మంది, గర్ల్స్​ 5,734 మంది పాసయ్యారు. నారాయణపేట జిల్లాలో 7,655 మంది   అటెండ్​ కాగా 3,598 మంది బాయ్స్​, 4,057 మంది గర్ల్స్​ ఉన్నారు.   93.13 శాతంతో  7,129 మంది పాసయ్యారు. వీరిలో బాయ్స్​ 3,274 మంది ఉండగా, గర్ల్స్​ 3,855 మంది ఉన్నారు.  

నాగర్​ కర్నూల్​ :  జిల్లా   91.57శాతం ఉత్తీర్ణత సాధించింది.   గతేడాది కంటే  ఈసారి  రెండు స్థానాలు కిందికి దిగింది.  జిల్లాలోని 303 ప్రభుత్వ, ప్రైవేట్​, గురుకుల పాఠశాలల నుంచి  10,507 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,621 మంది పాసయ్యారు.   బాయ్స్​ 90.20శాతం, బాలికలు 92.91శాతం మంది  ఉత్తీర్ణులయ్యారు.  నాగర్​ కర్నూల్​ మండలంలో అత్యధికంగా 191 మంది విద్యార్థులు ఫెయిల్​ కాగా, కల్వకుర్తి మండలంలో 190 మంది ఫెయిలయ్యారు. ఉప్పునుంతల, పదర మండలాల్లో 100శాతం ఉత్తీ ర్ణత సాధించారు.  

వనపర్తి  :  జిల్లాలో  86.93శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.  నిరుటి కన్నా మెరుగైన ఫలితాలే వచ్చినప్పటికీ రాష్ట్రంలో 29వ స్థానంలో   నిలిచింది.  వచ్చిన ఫలితాల్లోనూ  బాలికలదే  పైచేయి ఉంది.    6888 మంది స్టూడెంట్లు పరీక్షకు హాజరు కాగా 5988 మంది ఉత్తీర్ణులయ్యారు.  బాలికలు 3397 మంది, బాలురు 2591 మంది ఉన్నారు.      గవర్నమెంటు  బడుతల్లోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి.

బీసీ వెల్ఫేర్​ బడుల్లో నూరు శాతం ఫలితాలు సాధించారు. టైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​లో 97.95శాతం, ప్రైవేటు సెక్టారులో 97.24, సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్లో 95.01, కేజీబీవీలో 93.28 (15కేజీబీవీల్లో శ్రీరంగాపూరు, చిన్నంబావి, పెద్దమందడిల్లో నూరుశాతం), మైనారిటీలో రెసిడెన్షియల్​లో 92.70, మోడల్​ స్కూల్స్​లో 92.34, ఆశ్రమ పాఠశాలల్లో 82.35, .జడ్పీ స్కూళ్లలో 78.21, గవర్నమెంటు స్కూళ్లలో 53.79శాతం చొప్పున ఉత్తీర్ణత నమోయ్యింది. 

గద్వాల  :  జోగులాంబ గద్వాల జిల్లాకు రాష్ట్రస్థాయిలో 32వ స్థానం దక్కింది.  జిల్లా వ్యాప్తంగా 7175 మంది స్టూడెంట్స్  పరీక్షలకు హాజరైతే 5839 మంది విద్యార్థులు 81.38%ఉత్తీర్ణత సాధించారు. ఇందులో  బాలురు 78.67% బాలికలు 83.97% ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతంలో బాలికలు పై చేయి సాధించారు.  జిల్లాలో మొత్తం 34 మంది స్టూడెంట్స్ పదికి పది పాయింట్లు సాధించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 23 స్కూల్ లలో 100% రిజల్ట్ వచ్చింది

అందులో మునగాల హై స్కూల్, బీసీ వెల్ఫేర్ కేటి దొడ్డి, కేజీబీవీ కేటి దొడ్డి, రెసిడెన్షియల్ బాయ్స్ హై స్కూల్ బీచుపల్లి, ఎస్ ఎస్ డబ్ల్యూ ఇటిక్యాల, ఐజ స్కూలు  100  రిజల్ట్ సాధించాయి.  గత ఏడాది జోగులాంబ గద్వాల జిల్లాకు ఎస్ఎస్సి రిజల్ట్ లో జిల్లాకు 27వ స్థానం రాగా ఈసారి 32వ స్థానానికి దిగజారింది.

ఈ అకాడమిక్​ ఇయర్​లో హైస్కూల్స్​లో సబ్జెక్ట్​ టీచర్ల కొరత, ఉన్న టీచర్లు డిప్యూటేషన్ల పైరవీలు, మండలాలకు ఇంచార్జీ  ఎంఈఓలు , ఇన్​టైం కు అందని టెక్ట్స్​ బుక్స్​ పలు కారణాలతో 10వ తరగతి రిజల్ట్స్​ పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.