మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన జ్యోతి

మరో ఇద్దరి జీవితాల్లో  వెలుగులు నింపిన జ్యోతి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మరణాంతరం కండ్లను దానం చేసి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ఆదర్శంగా నిలిచిన ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. ఏనుగొండకు చెందిన న్యాయవాది గంగయ్య కుమార్తె జ్యోతి (36) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. తన మరణాంతరం కండ్లను దానం చేయాల ని ఆమె కుటుంబసభ్యులను కోరడంతో  తండ్రి గంగయ్య రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ నటరాజుకు సమాచారం అందించారు. 

ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చెందిన టెక్నీషియన్లు వచ్చి జ్యోతి కండ్ల కార్నియాను సేకరించారు. అనంతరం ధృవపత్రాలను అందించారు. కూతురి కండ్లను దానం చేసేందుకు ముందుకొచ్చిన కుటుంబాన్ని న్యాయవాది మనోహర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు పాలమూరు, మహబూబ్ నగర్ లయన్స్ క్లబ్ సభ్యుడు, న్యాయవాది కృష్ణయ్య అభినందించారు. మరణాంతరం ఎవరైనా నేత్రదానం చేయాలనుకుంటే 9666900900 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.