16 కిలోల బంగారు చీరలో అమ్మవారు.. ఫోటోలు వైరల్

16 కిలోల బంగారు చీరలో అమ్మవారు.. ఫోటోలు వైరల్

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ.. రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఈ దసరా సందర్భంగా అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. బంగారు చీర అంటే ఏదో అనుకునేరు. ఏకంగా 16 కేజీల బంగారంతో చీరను తయారుచేశారు. పూణేలోని సరస్‌బాగ్ పరిధిలోని మహాలక్ష్మి ఆలయంలోని అమ్మవారికి ఈ చీరను బహుకరించారు. ఈ చీరను ఒక భక్తుడు 2011లో కానుకగా ఇచ్చినట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి మరియు దీపావళి పర్వదినాలలో బంగారు ఆభరణాలు మరియు చీరలను అలంకరిస్తామని, ఆ విధంగానే ఈ చీరను అలంకరించినట్లు ఆయన చెప్పారు. బంగారు చీరతో అమ్మవారు చూపుతిప్పుకోకుండా చేస్తుండటంతో భక్తులు ఉదయం నుంచి ఎక్కువ సంఖ్యలో ఆలయానికి వస్తన్నారు.