మాలలకు మాట ఇచ్చి తప్పిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఓడించి తీరుతామని మాల మహానాడు నాయకులు ప్రకటించారు. బెల్లంపల్లిలోని ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కుంబాల రాజేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి మీడియాతో మాట్లాడుతూ.. గడ్డం వినోద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. మాల భవన్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఇస్తానని ఓట్లు వేయించుకొని గెలిచిన దుర్గం చిన్నయ్య మాలలను మోసం చేశారని మండిపడ్డారు.
బెల్లంపల్లిలో మాలల భవన నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయిస్తానని గడ్డం వినోద్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. బెల్లంపల్లిలో మాలలంతా వినోద్ కు ఓట్లేసి గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బని రాజనర్సు, నియోజకవర్గం ప్రెసిడెంట్ ఎరుకల శ్రీనివాస్, మహిళా జిల్లా అధ్యక్షురాలు దాసరి విజయ, టౌన్ ప్రెసిడెంట్ దాసరి ప్రతాప్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, సంఘం జిల్లా, పట్టణ నాయకులు యాదగిరి , సుంకిత సమ్మయ్య, లింగాల అమృత, మురళి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.