అందుకే ఠాక్రే సర్కార్ను కూల్చేశాం: సీఎం షిండే

అందుకే ఠాక్రే సర్కార్ను కూల్చేశాం: సీఎం షిండే

ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే.. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రను 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు..అందుకే ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేశామని ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు.  ఒక్కరి అహన్ని సంతృప్తి పరచడానికి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు నిలిపివేయడం దురదృష్టకరమన్నారు .షిండే.. అయితే తన కొడుకు శ్రీకాంత్ షిండేను గత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దించడాన్ని షిండే సమర్థించుకున్నారు.  ఆ సమయంలో పార్టీకి ఉన్నత విద్యావంతులు, యువతరం అవసరం అయినందునే అలా చేయాల్సి వచ్చిందన్నారు.

ఉన్నత విద్యావంతుడు,యువకుడిని ఎన్నికల్లో పోటీ చేయించాలని 2019 లోక్ సభ ఎన్నికల్లో  పార్టీ తన కొడుకు శ్రీకాంత్ కు టికెట్ ఇచ్చిందన్నారు. శ్రీకాంత్ విజయంతో పార్టీ బలం మరింత పెరిగిందని చెప్పారు.  షిండే కుమారుడు  శ్రీకాంత్ షిండే ప్రతినిధ్యం వహిస్తున్న కళ్యాణ్ లోక్ సభ నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల పర్యటించి కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాని విజ్ఞప్తి చేశారు. దీనికి కౌంటర్ గా సీఎం ఏక్ నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రేకు కౌంటర్ ఇచ్చారు.