ముంబైలో పాఠశాలలు పునఃప్రారంభం

ముంబైలో పాఠశాలలు పునఃప్రారంభం

కరోనా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండేళ్ల నుంచి ఫస్ట్, సెకండ్ వేవ్ లో స్కూళ్లు సరిగ్గా నడవకపోడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ముచ్చటగా మూడోసారి కూడా కరోనా థర్డ్ వేవ్ విజృంభించడంతో మహారాష్ట్రలో పాఠశాలలకు తాత్కాలికంగా సెలువులు ప్రకటించారు. అయితే ఒకవైపు కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నా..విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చే వారం నుంచి  పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ ప్రకటించారు. ఈ నెల 24 నుంచి 1 నుంచి 12 తరగతులను ప్రారంభించాలనే ప్రతిపాదనలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అంగీకరించాని చెప్పారు. పిల్లలు చదువుకు దూరమవుతున్నారని స్కూల్స్ తెరవాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వాయువేగంతో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాలలు ప్రారంభించే విషయంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు గైక్వాడ్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం 
దినేశ్ యాదవ్కు ఐదేళ్ల జైలు శిక్ష

నీట్ పీజీ పరీక్షలో ఓబీసీలకు రిజర్వేషన్లు