రామ్ లల్లాకు 7అడుగుల 3అంగుళాల పొడవైన ఖఢ్గం.. సమర్పించిన మహారాష్ట్ర భక్తులు

రామ్ లల్లాకు 7అడుగుల 3అంగుళాల పొడవైన ఖఢ్గం.. సమర్పించిన మహారాష్ట్ర భక్తులు

మహారాష్ట్రకు చెందిన కొందరు భక్తులు అయోధ్యలోని రామ్ లల్లాకు 80కిలోల బరువు.. 7అడుగుల 3అంగుళాల పొడవున్న భారీ ఖడ్గాన్ని సమర్పించారు. ఇది భగవాన్ రామ్ లల్లా.. అతని భక్తుల మధ్య అపారమైన భక్తి, గౌరవాన్ని మాత్రమే కాకుండా.. దేశమంతటా ఉన్న భక్తులు, అయోధ్య మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.

తాను మహారాష్ట్రలోని ముంబైలో చారిత్రక ఆయుధాలు సేకరిస్తూ ఉంటానని, ఇప్పటికే తన ఆయుధాల ప్రదర్శనలు కూడా ఇచ్చానని కత్తిని తీసుకువచ్చిన భక్తుల్లో ఒకరైన నీలేష్ అరుణ్ సాకర్ తెలిపారు. ఈ రోజు ఇక్కడికి ఈ భారీ కత్తి రామునికి అంకితం చేశానన్నారు. ఈ ఖఢ్దం ప్రత్యేకతేంటంటే.. దీని బరువు 80కిలోల బరువుతో పాటు, 7అడుగుల 3అంగుళాల పొడవు ఉంటుందని చెప్పారు. దీన్ని ఉక్కుతో తయారు చేశారని, హ్యాండిల్ మాత్రం ఇత్తడితో తయారు చేశారన్నారు. దీనిపై బంగారు కవచం కూడా ఉంటుందని చెప్పారు. నిశితంగా పరిశీలిస్తే.. దశావతారాలు(పది అవతారాలు) పొందుపర్చబడి ఉన్నాయన్నారు.

ఇక రెండో రోజైన జనవరి 23న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత అయోధ్యకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. పొగమంచు, చలి ఉన్నా... ప్రజలు తెల్లవారుజాము నుంచే రాంపథ్, ఆలయ ప్రాంగణం చుట్టూ పెద్ద సంఖ్యలో క్యూలలో కనిపించారు. అయోధ్య వీధుల్లో వయసుతో సంబంధం లేకుండా.. అందరూ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ.. రామున్ని స్మరించుకున్నారు.