గవర్నర్ కామెంట్లపై మహారాష్ట్ర అసెంబ్లీలో రచ్చ

గవర్నర్ కామెంట్లపై మహారాష్ట్ర అసెంబ్లీలో రచ్చ

మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో రచ్చ జరిగింది. ఛత్రపతి శివాజీపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మహా వికాస్ అఘాడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో గవర్నర్ కోశ్యారీ బడ్జెట్ ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించి సభ నుంచి వెళ్లిపోయారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

 

సభ వాయిదా పడిన తర్వాత కూడా మహా వికాస్ అఘాడీ పార్టీ నేతలు సెంట్రల్ హాల్ బయట నిరసన కొనసాగించారు. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యే సంజయ్ దౌండ్ శీర్షాసనమేసి నిరసన వ్యక్తం చేశారు. 

 

ఆదివారం ఔరంగాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ  ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువు సమర్థ్ రామ్ దాస్ లేకుంటే శివాజీ ఏం చేయగలిగేవాడు కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా దుమారం రేపాయి. గవర్నర్ క్షమాపణ చెప్పాలంటూ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

ధరణితో కొత్త సమస్యలు సృష్టించారు

మంత్రి హత్య కుట్ర డ్రామాకు మూలం కేసీఆరే