H3N2 Virus : ఇన్‌ఫ్లుయెంజాతో మెడికల్ స్టూడెంట్ మృతి

H3N2 Virus : ఇన్‌ఫ్లుయెంజాతో మెడికల్ స్టూడెంట్ మృతి

దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు కలకలం రేపుతున్నాయి. హెచ్3ఎన్2 వైరస్ తో తాజాగా మహారాష్ట్రలో ఓ మెడికల్ విద్యార్థి మరణించాడు. అహ్మదానగర్ లోని ఓ కళాశాలో మెడిసిన్ చదువుతున్న ఈ విద్యార్థి వారం రోజుల క్రితం ఫ్రెండ్స్ తో కలిసి కొంకణ్ లోని అలీబాగ్ కు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పటినుంచే అతను అనారోగ్యం పాలైనట్టు సమాచారం. ఆ తర్వాత పలు లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన విద్యార్థి.. పరీక్ష చేయించుకోగా కొవిడ్ తో పాటు హెచ్3ఎన్2 వైరస్ సోకినట్లు వైద్యులు నిర్థారించారు.

ఇక నాగ్‌పూర్‌లోనూ హెచ్‌3ఎన్2 వైరస్ సోకి ఓ వృద్ధుడు మృతి చెందాడు . ఇటీవలే వైరస్ బారిన పడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు కేసులతో కలిపి దేశంలో H3N2 ఇన్ ఫ్లుయెంజా వైరస్ మరణాల సంఖ్య 9కి చేరుకుంది.