నాలుగు నెలల బిడ్డతో అసెంబ్లీకి ఎమ్మెల్యే

నాలుగు నెలల బిడ్డతో అసెంబ్లీకి ఎమ్మెల్యే

మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే మరోసారి వార్తల్లో నిలిచారు. తన నాలుగు నెలల బిడ్డతో ముంబైలోని మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తన బిడ్డను ఎత్తుకుని ఆమె రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు గతేడాది డిసెంబర్‭లో నాగ్‭పూర్‭లో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలకు కూడా చంటి పిల్లాడితో సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమయంలో తన బిడ్డను ఎత్తుకున్న ఎమ్మెల్యే సరోజ్ అహిరే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి తన నాలుగు నెలల బిడ్డతో ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే సరోజ్ అహిరే నాసిక్‭లోని డియోలాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.