ముదురుతున్న "మహా" సంక్షోభం

ముదురుతున్న "మహా" సంక్షోభం

మహారాష్ట్ర రాజకీయాలు రంజురంజుగా సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారంటూ పోస్టర్లు వెలిశాయి. ఔరంగాబాద్ లో వెలిసిన ఈ పోస్టర్లు నెట్టింట వైరల్ గా మారాయి. మీ ఆశీర్వాదాలు మాపై కొనసాగుతాయి..సీఎం అయిన తర్వాత Pandharpurకు రావాలంటూ పోస్టర్ లో రాశారు. మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని MVA ప్రభుత్వం మనుగడ కోసం పోరాడుతోంది. పాలక కూటమి నుంచి శివసేన వైదొలగాలని పట్టుబట్టిన శివసేన సీనియర్ నాయకుడ, మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకపోయింది. ప్రస్తుతం ఇండిపెండెంట్లతో కలిపి తనకు 46 మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉందని ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు. గురువారం మరో ముగ్గురు శివసేన ఎమ్మె్ల్యేలు తిరుగుబాటు శిబిరంలో చేరిపోయారు.

దీంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 42కి చేరుకుంది. వీరిలో 35 మంది అధికార శివసేకు చెందిన ఎమ్మెల్యేలు కాగా.. మిగతా వారు స్వతంత్ర శాసనసభ్యులు. ఇద్దరు Prahar Sanghatana పార్టీకి చెందిన వారు. బుధవారం రాత్రి సీఎం ఉద్ధవ్ థాక్రే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. దాని కంటే ముందు.. రాష్ట్ర ప్రజలు, రెబల్ ఎమ్మెల్యేలను ఉద్ధేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. అనంతరం గురువారం సాయంత్రం రెబల్ ఎమ్మెల్యేలు రాసిన మూడు పేజీల లేఖను ఏక్ నాథ్ షిండే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజా పరిణామాలతో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం పతనం అంచున ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

  • మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. 
  • ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 
  • రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
  • ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు గురికాకుండా ఉండాలంటే షిండేకు పార్టీలో రెండింట మూడొంతుల మంది (37) ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం.
  • 46 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని షిండే అంటున్నారు.