
ఎట్టకేలకు మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. సీఎం ఉద్దవ్ థాకరే పంపించిన శాఖల కేటాయింపు జాబితాకు గవర్నర్ కోష్యారి ఆమోదం తెలిపారు. కీలకమైన హోంశాఖ, ఆర్థికశాఖ ఎన్సీపీకి దక్కింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు ఆర్థిక శాఖతో పాటు ప్లానింగ్ శాఖ లభించింది. సుభాష్ దేశాయికి పరిశ్రమల శాఖ ఇచ్చారు. అనిల్ దేశ్ ముఖ్ కు హోంశాఖ దక్కింది. ఏకనాథ్ షిండేకు పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు సీఎం ఉద్దవ్ థాకరే. కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెబ్ ధోరట్ కు రెవిన్యూశాఖ దక్కగా.. ఆదిత్య థాకరేకు పర్యావరణం, పర్యాటక శాఖలు కేటాయించారు.
ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ కు మైనార్టీ సంక్షేమంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ శాఖ లభించింది. చగన్ భజ్ బుల్ కు సివిల్ సప్లై, ఫుడ్ మంత్రిత్వ శాఖ దక్కింది. జయంత్ పాటిల్ కు వాటర్ రిసోర్సెస్ శాఖ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు పబ్లిక్ వర్క్ శాఖ కేటాయించారు. న్యాయ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు సీఎం ఉద్దవ్ థాకరే. రాజీనామా చేశారనే ప్రచారం జరిగిన శివసేన మైనార్టీ నేత అబ్దుల్ సత్తార్ కు రెవిన్యూ, గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.