మహిళా పోలీసులకు 8 గంటలే డ్యూటీ

V6 Velugu Posted on Sep 25, 2021

ముంబై: మహారాష్ట్ర సర్కారు మహిళా పోలీసులకు తీపి కబురు చెప్పింది. వాళ్ల డ్యూటీ టైమింగ్స్​ను 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహిళా పోలీస్ ఫోర్స్​లో 8 గంటల షిఫ్టులను అమలు చేస్తామని డీజీపీ సంజయ్ పాండే శుక్రవారం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నామన్నారు. దశలవారీగా రాష్ట్రమంతటా విస్తరిస్తామన్నారు. అందుకు తగ్గట్టు షిఫ్ట్​లు మారుస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నాగ్​పూర్, పుణె, అమరావతిలో మహిళా పోలీసులకు 8 గంటల చొప్పున డ్యూటీలు అమలవుతున్నాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ మధ్యే నవీ ముంబైలోనూ లేటెస్ట్ డ్యూటీ టైమింగ్స్ అమలుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఎక్కువ సిబ్బంది అవసరమయ్యే నాలుగు మెట్రోపాలిటన్ సిటీల్లో కొత్త టైమింగ్స్ అమలు 

Tagged Maharashtra, Women Cops, 8 hours, Working Hours

Latest Videos

Subscribe Now

More News