
భూమ్మీద ఎన్నో రకాల జంతువులు, పక్షులు, చెట్లు ఉన్నాయి. ఇంకా మనకు తెలియని ఎన్నో రకాల జీవులు ఉంటాయి కూడా. వాటిని కనిపెట్టడానికి మరో 450 ఏళ్లు పడుతుందనేది సైంటిస్టుల మాట. అయితే ఇప్పటి వరకూ తెలియని ఓ చెట్టును మహారాష్ట్ర సైంటిస్టులు కనుక్కున్నారు. మహారాష్ట్రలో నవోరోజ్ గోద్రెజ్ సెంటర్ ఫర్ ప్లాంట్ రీసెర్చ్ సైంటిస్టులు లోకల్ జాతులను డాక్యుమెంట్ చేసే ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇంతకు ముందెన్నడూ చూడని ఒక చెట్టును కనిపెట్టారు. ఖైరేశ్వర్ నుండి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న కనుమల్లో ఈ చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలకు ఉన్న ఆకులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. అవి రెండు రకాలుగా ఉన్నాయి. 40 నుంచి 50 సెంటీమీటర్ల అడుగుల వరకూ ఈ చెట్టు పెరుగుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ చెట్టు‘క్రోటన్ లావియానస్’ జాతికి చెందిన చెట్టుగా భావిస్తున్నారు. అదే ప్రాంతంలో రీసెర్చర్లకి 50కి పైగా చెట్లు కనిపించాయి. ఈ చెట్లకు వంద సంవత్సరాల వయసు ఉంటుందని అంచనా.