మహారాష్ట్రలో భారీగా డ్రగ్స్ పట్టివేత

 మహారాష్ట్రలో భారీగా డ్రగ్స్ పట్టివేత
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ పీజీ చేసి.. డ్రగ్స్ తయారు చేస్తుండు
  • ఫార్మా కంపెనీపై  నార్కో  దాడులు.. భారీగా మాదక ద్రవ్యాలు పట్టివేత

ముంబయి: మహారాష్ట్రలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుపడ్డాయి.  మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగించే 704 కిలోల మెఫెడ్రోన్ ను సీజ్ చేశారు. మార్కెట్లో దీని విలువ 1400 కోట్లు పైబడి ఉంటుందని అంచనా వేశారు. ఔషధాల ముసుగులో మాదక ద్రవ్యాలు తయారీ చేస్తున్న ఉదంతం కలకలం రేపింది.  దేశ ఆర్ధిక రాజధాని ముంబయి  వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనం సృష్టించింది.  ఆర్గానిక్ కెమిస్ట్రీ పీజీ చేసిన వ్యక్తి ఫార్మా కంపెనీలో ఔషధాల ముసుగులో  డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు బయటపడింది. 

విశ్వసనీయ సమాచారం మేరకు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పాల్ఘర్ జిల్లా నాలాసోపారా సమీపంలోని ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహించగా మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు బయటపడింది. యాంటీ నార్కోటిక్స్ విభాగం వారితో కలసి తనిఖీలు చేసిన మహారాష్ట్ర పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.   నాలాసొపారా ఫార్మా యూనిట్ లో పట్టుపడిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా.. ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన ఆ వ్యక్తి తయారీదారు చేస్తున్నట్లు తేలింది. మాదక ద్రవ్యాల తయారీదారుల్లో ఇతనొకడని గుర్తించారు. రాష్ట్రంలో తరచూ మాదక ద్రవ్యాలు పట్టుపడుతున్నా ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుపడడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.