టెండు ఆకులతో బీడీల తయారీ.. పచ్చ బంగారంతో కోట్లల్లో ఆదాయం

టెండు ఆకులతో బీడీల తయారీ.. పచ్చ బంగారంతో కోట్లల్లో ఆదాయం

ఛత్తీస్‌గఢ్‌లో వేసవి కాలం రాగానే పచ్చ బంగారం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. బస్తర్‌తో పాటు, మహాసముంద్ జిల్లాలోని అనేక కుటుంబాలు ఈ పచ్చి బంగారంతో ప్రతి ఏడాదీ చాలా ఆదాయం అర్జిస్తారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల లాభం వస్తోంది. ఇంతకీ పచ్చ బంగారం అంటే ఏంటా అని అనుకుంటున్నారా..! ఛత్తీస్‌గఢ్‌లోని ఇతర ప్రాంతాలలో కనిపించే టెండు ఆకుల్నే పచ్చ బంగారం అని పిలుస్తూ ఉంటారు.

బీడీలు చేయడానికి టెండు పట్టాను ఉపయోగిస్తారు. ఈ ఆకులు దొరకడం, తేలికగా రోలింగ్ చేసేందుకు సౌలభ్యత ఉండడంతో టెండు ఆకులతో బీడీలను తయారుచేసేందుకు అనుకూలమైనదిగా భావిస్తారు. బీడీ అంటే భారతీయ భాషలో చెప్పాలంటే దీన్నే సిగరెట్ గా భావిస్తూ ఉంటారు. టెండు ఆకులలో పొగాకును చుట్టడం ద్వారా ఈ బీడీలు తయారవుతాయి.'బీడీ' అనే పదం బీడ నుంచి ఉద్భవించింది. దీన్ని తమలపాకులు, కొన్ని ఇతర సుగంధ ద్రవ్యాలను జోడించి తయారు చేస్తారు.

మార్చి నెల నుంచి..

టెండు ఆకులు తెంపేందుకు ఇప్పటికే సీజన్ ప్రారంభం కాగా.. గ్రామస్తులు కమిటీల ద్వారా గత నెల మార్చి రెండో వారంలోనే కొమ్మల కోత పనులు పూర్తి చేశారు. ఈసారి టెండు ఆకుల రాక పెరిగే అవకాశం ఉంది. స్టాండర్డ్ బ్యాగ్ రేటు పెరగడంతో టెండు పట్టా కలెక్టర్ల కుటుంబీకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. మార్చి నెల ప్రారంభం కాగానే టెండు ఆకుల సీజన్ మొదలవుతుంది. గ్రామస్తులు, కమిటీలు ఆకులను కోయడపై దృష్టి పెడతాయి. తద్వారా కూలీలకు నాణ్యమైన టెండు ఆకులు లభిస్తాయి. వచ్చే మే ​మొదటి వారం నుంచి కలెక్టర్ల కుటుంబం టెండు ఆకులు తెంపడం ప్రారంభించనుంది.