లండన్ లో గాంధీ విగ్రహం ధ్వంసం..సిగ్గుమాలిన చర్య అని ఖండించిన భారత్

లండన్  లో గాంధీ విగ్రహం ధ్వంసం..సిగ్గుమాలిన చర్య అని ఖండించిన భారత్

లండన్​ లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. మంగళవారం(సెప్టెంబర్ 30) లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ధ్యాన భంగిమలో కూర్చున్న జాతిపిత కాంస్య విగ్రహం పునాదిని పగలగొట్టారు. 

ఈ ఘటనపై భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది..సిగ్గుమాలిన చర్యగా, అహింసా వారసత్వానికి అవమానం అని తెలిపింది. భారత దేశానికి వ్యతిరేకంగా  జరిగిన దాడిగా భావిస్తున్న లండన్​ లోని హైకమిషనర్​ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని పునర్మిస్తున్నట్లు తెలిపారు. 

టావిస్టాక్ స్క్వేర్ మహాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య అని.. ఇది కేవలం ధ్వంసం మాత్రమేకాదు అంతర్జాతీయ అహింసా దినోత్సవం మూడు రోజుల ముందు అహింసపై జరిగిన దాడి అని కమిషనర్​ తెలిపింది. విధ్వంసం నివేదికలపై దర్యాప్తు చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు ,కామ్డెన్ కౌన్సిల్ చెప్పారు. 

విగ్రహం గురించి..

ఇండియా లీగ్ మద్దతుతో కళాకారిణి ఫ్రెడ్డా బ్రిలియంట్ చెక్కిన విగ్రహం అది. 1968లో యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో గాంధీ న్యాయ విద్యార్థిగా ఉన్న కాలానికి నివాళిగా ఏర్పాటు చేశారు. 

ప్రతియేటా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆ ప్రదేశంలో పుష్పాంజలి ఘటించి గాంధీకి ఇష్టమైన భజనలను చేస్తారు. ఐక్యరాజ్యసమితి ఈ రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా ప్రకటించింది.

కాలక్రమేణా  టావిస్టాక్ స్క్వేర్ లండన్ శాంతి ఉద్యానవనాలలో ఒకటిగా మారింది. హిరోషిమా బాధితుల కోసం చెర్రీ చెట్టు, 1986లో UN అంతర్జాతీయ శాంతి సంవత్సరం కోసం నాటిన ఫీల్డ్ మాపుల్ ,మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్నవారిని గౌరవించటానికి 1995లో ఆవిష్కరించబడిన గ్రానైట్ స్మారక చిహ్నం ఉన్నాయి.