లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఓ రిజిస్టేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా డబ్బులు డిమాండ్ చేసిందని.. ఏసీబీకి వచ్చిన సమాచారం మేరకు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు.. తస్లీమా ఓ వ్యక్తి దగ్గర 19వేల 200 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఆ తర్వాత డాక్యుమెంట్ రైటర్ ల నుంచి 1లక్ష78వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం గురించి అధికారులు విచారణ చేపట్టారు.