ఆసీస్‌కు భారత్‌ గట్టి పోటీ ఇస్తుంది : మహేల జయవర్దనే

ఆసీస్‌కు భారత్‌ గట్టి పోటీ ఇస్తుంది  :  మహేల జయవర్దనే

భారత్,అస్ట్రేలియా జట్ల  మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ మొదలుకానుంది. నాగాపూర్ వేదికగా మొదలుకానున్న ఈ ట్రోఫీ కోసం ఇరు జట్ల ఇప్పటికే ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాయి. అయితే ఈ ట్రోఫీలో ఏ జట్టు విజయం సాధిస్తుందనే దానిపై శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్దనే  తన అంచనాలను వెల్లడించాడు.  అన్ని విభాగాల్లో రెండు జట్లు బలమైనవే అని చెబుతూనే   2-1 తేడాతో సిరీస్‌ను ఆసీస్‌  సిరీస్ ను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియాకు భారత్‌ గట్టి పోటీని ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. 

తొలిసారి 1996-97లో భారత్,అస్ట్రేలియా జట్ల  మధ్య బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ  జరగగా, అప్పుడు దానిని టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. అలాగే 2016 - 17, 2018 -2019, 2020 - 2021 సీజన్లలోనూ భారత జట్టే ట్రోఫీని గెలుచుకొంది. ఈసారి ట్రోఫీని కూడా సొంతం చేసుకొంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌ను వరుసగా నాలుగో సారి కూడా సొంతం చేసుకొన్న జట్టుగా భారత్‌ నిలువనుంది. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.