అంతర్జాతీయ క్రీడా దిగ్గజ సంస్థ GMR స్పోర్ట్స్ (GMR Sports) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరైన మహేల జయవర్ధనే (Mahela Jayawardene)ను సంస్థ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ (Director of Cricket)గా నియమిస్తున్నట్లు ఈరోజు (2026, నవంబర్ 20, శుక్రవారం) అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త బాధ్యతల్లో భాగంగా మహేల ఢిల్లీ క్యాపిటల్స్ (WPL), దుబాయ్ క్యాపిటల్స్ (ILT20), సదరన్ బ్రేవ్ (The Hundred) జట్ల క్రికెట్ వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపిక, ప్రతిభావంతుల అభివృద్ధిని పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌కు చెందిన హాంప్‌షైర్ క్రికెట్ (Hampshire Cricket) డైరెక్టర్ గైల్స్ వైట్‌తో కలిసి జట్ల మధ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
గతంలో కెప్టెన్.. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్:
గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మహేల జయవర్ధనే మళ్లీ GMR గ్రూప్‌తో జతకట్టడం విశేషం. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లలో మా క్రికెట్ వ్యాపారాన్ని విస్తరిస్తున్న వేళ, నాయకత్వాన్ని బలోపేతం చేయడం మా ఫస్ట్ ప్రయార్టీ.. గతంలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించిన మహేలకు మా సంస్థ జర్నీ గురించి పూర్తి అవగాహన ఉంది. విజయవంతమైన జట్లను నిర్మించడంలో ఆయనకున్న అపార అనుభవం మా గ్లోబల్ క్రికెట్ ఎకోసిస్టమ్‌కు ఎంతో బలాన్నిస్తుందని GMR స్పోర్ట్స్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి పేర్కొన్నారు.
GMR స్పోర్ట్స్ ప్రయాణంలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ (WPL), దుబాయ్ క్యాపిటల్స్, సదరన్ బ్రేవ్, హాంప్‌షైర్ జట్లతో కలిసి పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. ప్రతి జట్టు ప్రత్యేకతను కాపాడుతూనే, అత్యుత్తమ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే నా ఫస్ట్ టార్గెట్ అని మహేల వెల్లడించాడు.
భారత్ నుంచి గ్లోబల్ స్థాయి వరకు.. GMR స్పోర్ట్స్ సామ్రాజ్యం:
2008లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్తో క్రీడా రంగంలోకి అడుగు పెట్టిన GMR స్పోర్ట్స్, నేడు ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్‌లలో తమ ఫ్రాంచైజీలను కలిగి ఉంది. క్రికెట్‌లో దుబాయ్ క్యాపిటల్స్ (ILT20), ప్రిటోరియా క్యాపిటల్స్ (SA20), సీటెల్ ఓర్కాస్ (MLC - అమెరికా), హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (ఇంగ్లాండ్) జట్లని GMR సొంతం చేసుకుంది. క్రికెట్‌తో పాటు ప్రో కబడ్డీ లీగ్‌లో యూపీ యోధాస్, అల్టిమేట్ ఖో-ఖోలో తెలుగు యోధాస్, రగ్బీ ప్రీమియర్ లీగ్ జట్ల ద్వారా భారతీయ క్రీడలను GMR గ్రూప్ ప్రోత్సహిస్తోంది.
ALSO READ : సిరాజ్ను పక్కన పెట్టటానికి అతని పేరే కారణం
A wealth of experience and a visionary approach 👏 Mahela Jayawardene, Director of Cricket, GMR Sports 🌟 https://t.co/nbDnjXNNHk
— GMR SPORTS (@sports_gmr) November 20, 2026
A cricketing icon embarks on a new chapter in leadership 🌟 Welcome Mahela Jayawardene 👏 #GMRSports https://t.co/5dsLO1zdgL
— GMR SPORTS (@sports_gmr) November 20, 2026
Trusting the process, building the right culture, and working toward the ultimate goal 🤝 Mahela Jayawardene is all set to get his three-year vision in motion! 🚀 #GMRSports https://t.co/O9eW98eXHg
— GMR SPORTS (@sports_gmr) November 20, 2026
