టీఎస్​పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి

టీఎస్​పీఎస్సీ  చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి

టీఎస్​పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2024 జనవరి 26వ తేదీ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన  జాతీయ జెండాను అవిష్కరించారు. టీఎస్​పీఎస్సీ చైర్మన్​పదవిలో మహేందర్​రెడ్డి 10 నెలల పాటు కొనసాగనున్నారు.  

టీఎస్​పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డిని,  మరో ఐదుగురు సభ్యులుగా నియమితులయ్యారు. సభ్యుల్లో అనితారాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), అమీరుల్లాఖాన్​ (పోస్టల్ డిపార్ట్ మెంట్​ రిటైర్డ్​ఆఫీసర్), నర్రి యాదయ్య (జేఎన్టీయూ ప్రొఫెసర్), వై. రాంమోహన్ రావు (జెన్​కో ఈడీ), పాల్వాయి రజనీకుమారి (గ్రూప్ 2 ఆఫీసర్– రిజైన్డ్) ఉన్నారు. రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్​ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. దీంతో చైర్మన్​తోపాటు మరో ఐదుగురు సభ్యులను నియమిస్తున్నట్టు సీఎస్​ శాంతికుమారి జీవో 11 రిలీజ్ చేశారు.  

మహేందర్ రెడ్డి నేపథ్యం 

ఖమ్మం జిల్లా కుసు మంచి మండలం కిష్టాపురం గ్రామా నికి చెందిన మహేం దర్ రెడ్డి.. మధ్యతరగతి కుటుంబంలో 1962 డిసెంబర్ 3న జన్మించారు. వరంగల్ నిట్ లో బీటెక్, ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ పూర్తి చేశారు.1986లో ఐపీఎస్​కు సెలెక్ట్ అయ్యారు. నిజామాబాద్, కర్నూల్ ఎస్పీగా, సైబరాబాద్, హైదరాబాద్ సీపీగా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. 2017 నవంబర్ నుంచి 2022 డిసెంబర్ 31 వరకూ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.