సినీ న‌టుడు మ‌హేష్ ఆనంద్ కన్నుమూత

 సినీ న‌టుడు మ‌హేష్ ఆనంద్ కన్నుమూత

ప్రముఖ నటుడు 57 ఏళ్ల మహేశ్ ఆనంద్ కన్నుమూశారు. 80, 90వ దశకాల్లో బాలీవుడ్, టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకున్న విలన్ గా ఓ వెలుగు వెలిగారు.  ముంబైలోని అపార్ట్ మెంట్ లో నిన్న(శనివారం) ఉదయం మహేష్ ఆనంద్ డెడ్ బాడీని గుర్తించారు.  అతను చనిపోయి రెండు రోజులై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. చాలా కాలంగా సినిమా అవకాశాలు లేక ఒంటరి జీవితం గడుపుతున్న ఆనంద్….అడపా దడపా రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేవారు. కుటుంబీకులంతా కెనడాలో స్థిరపడ్డారు. జూహులోని కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం తర్వాత మహేశ్ మృతదేశాన్ని అక్కడే భద్రపరిశారు.

తెలుగులో నంబర్ వన్, ఎస్పీ పరుశురాం, బాలు తదితర సినిమాల ద్వారా పాపులరైన మహేశ్  ఆనంద్ అంతకు ముందే బాలీవుడ్ లోనూ సత్తా చాటుకున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన అనుకోకుండా మోడలింగ్ లోకి ప్రవేశించారు. ఇండియాలోనే టాప్ మేల్ మోడల్స్ లో ఒకడిగా బాలీవుడ్ దృష్టిని ఆకర్శించారు. మొదటి నుంచే నెగటివ్ పాత్రలకే పరిమితమైన మహేశ్ ఆనంద్….అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, గోవిందా లాంటి స్టార్లతో కలిసి పనిచేశారు. గోవిందా నటించిన రంగీలా రాజా మహేశ్ ఆనంద్ చివరి సినిమా.