జవాన్ సినిమా మీతోనే చూస్తాను మహేష్.. వైరల్ అవుతున్న షారుఖ్ ట్వీట్

జవాన్ సినిమా మీతోనే చూస్తాను మహేష్.. వైరల్ అవుతున్న షారుఖ్ ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Sharukh khan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan). సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ట్వీట్ చేశారు. నేను నా కుటుంబంతో కలిసి జవాన్ సినిమా చూస్తాను. సినిమా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.

ALSO READ: మెగా ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. ఇంతకీ ఏ సినిమా కోసం?

మహేష్ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పదించిన షారుఖ్‌ రీట్వీట్‌ చేస్తూ.. థ్యాంక్యూ సో మచ్‌ మై డియర్‌ ఫ్రెండ్‌.. నువ్వెప్పుడు సినిమా చూడాలనుకుంటున్నావో చెబితే, నేనూ నీతో సినిమాకొస్తా.  జవాన్‌ మూవీ మీకు నచ్చుతుందని నా నమ్మకం. మీ కుటుంబానికి నా శుభాభినందనలు.. అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం మహేష్ అండ్ షారుఖ్ చేసిన ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక మహేష్ అండ్ షారుఖ్ బయట కూడా మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ లేటెస్ట్ ట్వీట్స్ తో వీరి స్నేహం ఎంత బలమైందో మరోసారి ప్రూవ్ అయ్యింది.