సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌గా మహేష్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌గా మహేష్

మహేష్​ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌లో ‘గుంటూరు కారం’ చిత్రం తెరకెక్కుతోన్న  సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌‌‌లో శరవేగంగా జరుగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. మరోవైపు పాటల పనిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మూడు పాటలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వాటిలో ఫస్ట్ మెలోడీ సాంగ్‌‌‌‌ను త్వరలోనే రిలీజ్‌‌‌‌ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. 

ALSO READ: కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాం : ఆనంద్ దేవరకొండ 

సాంగ్ వర్క్ దాదాపు పూర్తయిందని, మిక్సింగ్ జరుగుతోందని, ఈ నెలాఖరుకు పాట విడుదల  చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్​ నటించాల్సి ఉంది. వీటిలో సందీప్ రెడ్డి రూపొందించనున్న చిత్రంలో మహేష్ బాబు కంప్లీట్ యాక్షన్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడట. 

ఇప్పటి వరకు స్టైలిష్​ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేసిన మహేష్ కోసం సందీప్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడట. ఇందులో మహేష్ ఫస్ట్ టైమ్  గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడట. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రణబీర్‌‌‌‌‌‌‌‌తో ‘యానిమల్’ తెరకెక్కిస్తుండగా, దీని తర్వాత విజయ్ దేవరకొండతోనూ ఓ మూవీ చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యాక మహేష్​తో మూవీ సెట్స్‌‌‌‌కి వెళ్లనుంది.