గుంటూరు కారం స్పైసీ మాస్ సాంగ్ లీక్..ఆడియన్స్ షాక్

గుంటూరు కారం స్పైసీ మాస్ సాంగ్ లీక్..ఆడియన్స్ షాక్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). ఈ సినిమాలో మహేష్కు జోడీగా..శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi chaudary) నటిస్తున్నారు.  

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి మరో సాంగ్ హుక్ స్టెప్ లీకైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ ఫ్యాన్స్, వాల్యూమ్‌ని పెంచడానికి సిద్ధంగా ఉండండి! గుంటూరు కారం నుండి ఒక హై వోల్టేజ్ స్పైసీ మాస్ నంబర్ హాట్..మరియు డ్యాన్స్ ఫ్లోర్‌లను దద్దరిల్లించడానికి రెడీగా ఉండండి..అంటూ మేకర్స్ రీసెంట్గా ఈ సాంగ్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

ఇక అప్పుడే సాంగ్ లీక్ అవ్వడంతో మేకర్స్ షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో తమన్ అదిరే మాస్ బీట్  కి మహేష్అ..శ్రీలీల స్టెప్స్ సూపర్ ఫ్యాన్స్ కి యమ కిక్కించేలా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ..ఇలా వరుస అప్డేట్స్ లీక్ అవుతుంటే..చూసే ఆడియన్స్కి ఏ మాత్రం థ్రిల్ ఇవ్వదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదలా ఉంచితే..చాలా రోజుల తరువాత,మహేష్ బాబు నుండి వస్తున్న పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమా కావడంతో..ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది.