స్టైలిష్ సర్కార్‌‌‌‌.. సంక్రాంతి బరిలో

V6 Velugu Posted on Aug 01, 2021


మహేష్‌‌ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్‌‌లో ‘సర్కారువారి పాట’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్‌‌ గురించి ఎప్పటికప్పుడు అప్‌‌డేట్స్ అందుతూనే ఉన్నాయి. అయితే ప్రేక్షకుల మనసు మాత్రం మహేష్‌‌ మీద ఉంది. ఈ మూవీలో ఎవరూ ఊహించని లుక్‌‌లో ఉంటాడని టీమ్ మొదట్నుంచీ ఊరిస్తూ ఉండటంతో తనని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాట పడుతున్నారు ఫ్యాన్స్. ఆ సమయం వచ్చేసింది. మహేష్‌‌ లుక్‌‌ నిన్న రిలీజయ్యింది. రెడ్‌‌ కలర్‌‌‌‌ కారులో నుంచి స్టైల్‌‌గా దిగుతూ ఫ్యాన్స్‌‌ని మెస్మరైజ్ చేయడానికి వచ్చాడు ప్రిన్స్. డిఫరెంట్‌‌ హెయిర్​ స్టైల్‌‌తో మరింత యంగ్‌‌గా కనిపించి మురిపిస్తున్నాడు. చెవి వెనకాల రూపాయి నాణెం టాటూ ఉంది. ముగ్గురు వ్యక్తులు వెళ్లిపోతున్నట్టు కార్​ విండోలోంచి కనిపిస్తోంది. మొత్తంగా పోస్టర్‌‌‌‌ అట్రాక్టివ్‌‌గా ఉంది. ఆగస్ట్ 9న మహేష్​ బర్త్ డే బ్లాస్టర్ ఉండబోతోందనే శుభవార్తతో పాటు సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. కీర్తి సురేష్‌‌ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్‌‌ ప్లస్‌‌ సంస్థలతో కలిసి  మహేష్‌‌ బాబు నిర్మిస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో పోయినేడు సంక్రాంతికి సందడి చేసిన మహేష్.. వచ్చే యేడు పవన్‌‌, ప్రభాస్‌‌లతో పాటు సంక్రాంతి బరిలోకి దిగుతుండటం విశేషం.

Tagged stylish, Mahesh Babu look, sarkaru vari pata first look

Latest Videos

Subscribe Now

More News