
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకదీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'SSMB29' . ఈ మూవీ గురించి దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఈ సినిమా గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ గా ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా 'SSMB29' గురించి వచ్చిన ఒక వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది. సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపు చేస్తోంది.
శ్రీరాముడిగా మహేష్ బాబు
భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ బాబు పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అది కూడా శ్రీరాముడి రూపంలో అని సమాచారం. ఈ పాత్ర సుమారు 8 నిమిషాలు పాటు ఉంటుందని తెలుస్తోంది. ఈ పీరియడ్ సీక్వెన్సులు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సన్ని వేశాల్లో మహేష్ బాబు వందల సంవత్సరాల వెనక్కి ప్రయాణించి .. రాక్షసులను అంతం చేసే యుద్ధ సన్నివేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇది కేవలం ఒక అతిథి పాత్రలా కాకుండా.. ఈ కథలో కీలకమైన మలుపుగా ఉంటుందని టాక్. అంతే కాకుండా ఈ సీన్ మహేష్ బాబుకు తెరపై ఒక అసాధారణమైన ఇమేజ్ ను తెచ్చిపెడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ తో ..
దర్శకధీరుడుగా పేరు తెచ్చుకున్న జకన్న.. తన సినిమాల్లో మైథాలిజీ అంశాలను అద్భుతంగా మిళితం చేయడంలో దిట్ట. దీనికి బాబుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలే దీనికి నిదర్శనం. ఇప్పుడు ఈ 'SSMB29' చిత్రంలో కూడా రాజమౌళి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు సమాచారం. భారతీయ పురాణ అంశాలను, ఆధునిక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ తో కలిసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం రాజమౌళి అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఈ కథ మలిచినట్లు టాక్. దీంతో ఈ 'SSMB29' సినిమా ప్రపంచ సినీ చరిత్ర ఒక సరికొత్త అధ్యాయం కానుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆగ్ర నటుల సరసన సూపర్ స్టార్..
సినీ ఇండస్ట్రీలో శ్రీరాముడి పాత్రలో నటించిన నటుల జాబితాలో మహేష్ బాబు కూడా చేరబోతున్నారు. ఇంతకుముందు సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటులు ఈ పాత్రను పోషించారు. ఇటీవలే ప్రభాస్ 'ఆదిపురుష్'లో రాముడి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం రణ్బీర్ కపూర్ 'రామాయణ' చిత్రంలో రాముడిగా నటిస్తున్నారు. ఈ అగ్రశ్రేణి నటుల సరసన మహేష్ చేరడం, రాజమౌళి దర్శకత్వంలో ఆ పాత్రను పోషించడంతో అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.
►ALSO READ | Kishkindhapuri Review: హారర్ థ్రిల్లర్ తో భయపెట్టిన 'కిష్కింధపురి'.. ప్రీమియర్స్ టాక్ ఇదే!
ఈ 'SSMB29' చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్. మాధవన్ వంటి నటులు కూడా భాగం అవుతున్నారు. ఇంకా మరికొంత మంది ఆగ్ర నటులు కూడా ఈ చిత్రంలో కీలకపోత్రలో పోషించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే మరో గొప్ప కళాఖండంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.