
ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఇది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ #SSMB28 నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ మూవీ మేకర్స్.. ఓ పోస్టర్ విడుదల చేసింది. చేతిలో సిగరెట్‌తో మాసీ లుక్‌లో ఉన్న మహేష్ బాబును ఈ పోస్టర్‌లో చూడొచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్ శివారులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో పూజా హెగ్దే, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత.. సుమారు పదమూడు ఏళ్ళ విరామం తర్వాత మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది.