
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఆదివారంతో 45వ పడిలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయనకు బర్త్‌డే గిఫ్ట్‌గా సర్కారు వారి పాట మేకర్స్ మోషన్ మోస్టర్ రిలీజ్ చేశారు. గీత గోవిందంతో మెగా హిట్ కొట్టిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 44 సెకన్‌ల ఈ లాంగ్ మోషన్ పోస్టర్‌లో మహేశ్ ఫేస్‌ను చూపించలేదు. రూపాయి కాయిన్‌ను కొద్ది సేపు చూపించారు. ఆ కాయిన్‌ను మహేశ్ ఎగరేస్తున్న సీన్ ఆకట్టుకుంటోంది.
Here is Superstar's Birthday special from team #SarkaruVaariPaata ?? https://t.co/ITdb6pbTHI #HBDMaheshBabu
Super ⭐ @urstrulyMahesh @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus— Parasuram Petla (@ParasuramPetla) August 9, 2020
పరశురామ్ ఈ మోషన్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘హ్యపీ బర్త్‌డే మహేశ్ గారు. మిమ్మల్ని డైరెక్ట్ చేయాలనే నా కల నెరవేరనుండటంతో ఈ బర్త్ డే మాకు చాలా స్పెషల్. సెట్స్‌పైకి వెళ్లడానికి ఎదురు చూస్తున్నా. మీ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావాలనుకుంటున్నా’ అని మరో ట్వీట్‌లో పరశురామ్ పేర్కొన్నారు. ‘నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేను నీతో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. హ్యపీ బర్త్ డే ఎంబీ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంటా’ అని మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.