మహేశ్వర్​రెడ్డి దీక్ష భగ్నం చేసిన పోలీసులు

మహేశ్వర్​రెడ్డి దీక్ష భగ్నం చేసిన పోలీసులు

నిర్మల్​మాస్టర్ ప్లాన్ తో పాటు జీవో నెంబర్ 220ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఆగస్టు 21న తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ని దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నించారు. 

వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. హాస్పిటల్​లోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఆసుపత్రికి తరలి వెళ్లారు. దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీఎం కేసీఆర్, మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఇయ్యాల నిర్మల్​కు కిషన్​రెడ్డి

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి సోమవారం నిర్మల్​కు రానున్నారు. నిర్మల్​మాస్టర్​ ప్లాన్​ కోసం తెచ్చిన జీవో 220ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలపనున్నారు. శనివారం పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన కార్యకర్తలను  కిషన్​రెడ్డి పరామర్శించనున్నారు.