
నిర్మల్, వెలుగు: కాంగ్రెస్కు రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి వివేక్ కు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పనిచేద్దామని వివేక్ అన్నారు. మహేశ్వర్ రెడ్డి వెంట మాజీ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ తదితరులు ఉన్నారు.