స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటాలి : పగడాల మంజుల

స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటాలి : పగడాల మంజుల

కారేపల్లి, వెలుగు : కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల పిలుపునిచ్చారు. మండలంలోని గేటు కారేపల్లి లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె  మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందన్నారు. 

ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై చాలా మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు బానోత్ రామ్మూర్తి, ఇమ్మడి తిరుపతిరావు, బానోత్ దేవులానాయక్, పర్సా సనత్ కుమార్, నర్సింగ్ శ్రీనివాస్, తోటకూరి రాంబాబు, అజ్మీర నరేశ్, మల్లెల నాగేశ్వరరావు, గోపాల్, భీముడు, హీరాలాల్ పాల్గొన్నారు.