నల్గొండ అర్బన్, వెలుగు: హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప కన్నుమూశారు. శనివారం ఆమె డెడ్‌బాడీని నల్గొండ గడియారం సెంటర్‌లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి తీసుకువచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సీపీఎం నాయకులు మల్లు లక్ష్మి, నాయకులు ఘన నివాళి అర్పించారు. దేవరకొండ రోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించగా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
