ఇంధన కష్టాలు పెరుగుతున్న వేళ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్న ఆటో లవర్స్‌కు ఇది అదిరిపోయే శుభవార్త. దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోపై మార్చి నెలలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఆఫర్లను ప్రకటించింది. కొత్త మోడళ్ల రాకతో పాత స్టాక్‌ను క్లియర్ చేయడంతో పాటుగా.. దేశీయ ఈవీ మార్కెట్లో తన పట్టును పెంచుకోవడానికి కంపెనీ ఏకంగా రూ.4 లక్షల వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు గనుక స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఈవీ కోసం చూస్తుంటే.. ఈ నెల మీకు సరైన సమయం అనే చెప్పాలి.
మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో అత్యధిక ఆఫర్లను అందిస్తున్న మోడల్ ఏదైనా ఉందంటే అది XUV 400 EL Pro. ఈ కారుపై కంపెనీ ప్రస్తుతం రూ.4 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది కంపెనీ. ఇందులో 34.5 kWh, 39.4 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి సింగిల్ ఛార్జ్‌పై 359 కిమీ నుంచి 456 కిమీ వరకు రేంజ్‌ను ఇస్తాయి. ఈ మోడల్ కార్ల ధర రూ.17లక్షల 49వేలుగా ఇప్పుడు కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్‌తో అత్యంత ఆకర్షణీయమైన డీల్‌గా మారింది.
మహీంద్రా నుండి వచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 6 కూడా భారీ ఆఫర్ల జాబితాలో చేరిపోయింది. ఈ కారుపై ఏకంగా రూ.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది మహీంద్రా గ్రూప్. ఇది 59 kWh, 79 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.18లక్షల 90వేలుగా ఉంది. మరోవైపుప్రీమియం లుక్‌తో ఆకట్టుకునే 'XEV 9e' మోడల్‌పై కూడా కంపెనీ రూ.లక్షా 40వేల వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ కారు లాంగ్ డ్రైవ్ ఇష్టపడే వారికి అద్భుతమైన ఆప్షన్ అంటున్నారు ఆటో నిపుణులు.
ALSO READ : ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న కార్ల రేట్లు..
మహీంద్రా ఇప్పటికే తన లైనప్‌లోకి XEV 9S, XUV 3XO EVలను చేర్చింది. భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత మోడళ్లపై ఇస్తున్న ఈ భారీ డిస్కౌంట్లు కేవలం ఈ మార్చి నెలకు మాత్రమే పరిమితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు.. ఈ భారీ ఆఫర్లను ఉపయోగించుకుని మహీంద్రా ఈవీని ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే సరైన అవకాశం.
