
భారతదేశపు అతిపెద్ద ఎస్‌యూవి కార్ల తయారీ సంస్థ మహీంద్రా త్వరలో థార్ కొత్త వేరియంట్ 2డబ్ల్యూడీని ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఫోర్ వీల్ డ్రైవ్ మోడల్ తో ఉన్న థార్ వేరియంట్లను మార్చి టూ వీల్ డ్రైవ్ వేరియంట్ తో తీసుకొస్తున్నారు.
1,497సీసీ ఇంజిన్, 117 హెచ్ పి పవర్ అవుట్ పుట్ ని కలిగి ఉంటుంది. ఇందులో ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లు ఉంటాయి. ఎస్ యూవీ 4డబ్ల్యూకి బదులుగా 2డబ్ల్యూ సిస్టమ్ కలిగి ఉంన్నందున ఈ మోడల్ కార్లు బరువు తక్కువ ఉంటాయి. ఈ ఎస్యూవీకి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది.