
ఐదు డోర్ల థార్ రాక్స్‌ను మహీంద్రా రూ.13 లక్షల ఎక్స్‌షోరూం ధరతో లాంచ్ చేసింది. ఇది 2 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ వేరియంట్లలో వస్తుంది. ఆరు గేర్లు ఉంటాయి. ఇందులో 6-స్లాట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, రెండు 10.25-అంగుళాల డిస్ప్లేలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో ఏసీ, సేఫ్టీ కోసం టీపీఎంఎస్, ఎడాస్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.