
మహింద్రా అండ్ మహింద్రా కొత్త బొలెరో కేంపర్ గోల్డ్ జెడ్‌ఎక్స్‌ను తెలంగాణ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ వెహికిల్ ధర రూ.7.28 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ వెహికిల్‌ను తెలంగాణ ప్లాంట్ జహీరాబాద్‌లో తయారు చేసింది.
కొత్త వెహికిల్‌తో పాటు బొలెరో కేంపర్ రేంజ్‌ను జహీరాబాద్ ప్లాంట్‌లోనే తయారు చేస్తున్నట్టు ఎం అండ్ ఎం ఆటోమొటివ్ డివిజన్ మార్కెటింగ్, వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గర్గ్ చెప్పారు. కమర్షియల్ వెహికిల్ రేంజ్‌లో బొలెరో తమ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ అని, 86 శాతం మార్కెట్ షేరుతో ఇది లీడర్‌గా ఎదిగిందని తెలిపారు.