
గుజరాత్ లోని గిర్ సోమనాథ్ తీరంలో అరేబియా సముద్రంలో 15పడవలు మునిగాయి. దాంతో 11మంది మత్య్సకారులు గల్లంతయ్యారు. సముద్రంలోని గాలులు , అలల తీవ్రతకు పడవలు మునిగాయి. ఈ ఘటనలో 15మంది గల్లంతు కాగా .. నలుగురిని స్థానికులు కాపాడారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో సముద్రంలో అలలు, గాలులు తీవ్రంగా వీస్తుండటంతో ఈ ప్రమాదం ఏర్పడింది. . మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని కూడా సూచించింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.