మారిన బ్యాంక్ వెబ్ డొమైన్లు.. ఆర్బీఐ రూల్స్‌తో “.bank.in”కి ప్రభుత్వ ప్రైవేటు బ్యాంక్స్..

మారిన బ్యాంక్ వెబ్ డొమైన్లు.. ఆర్బీఐ రూల్స్‌తో “.bank.in”కి ప్రభుత్వ ప్రైవేటు బ్యాంక్స్..

భారతీయ బ్యాంకింగ్ రంగంలో చాలా ముఖ్యమైన మార్పు జరిగింది. దేశంలోని ప్రధాన బ్యాంకులైన SBI, HDFC, ICICI, Axis Bank సహా ఇతర సంస్థలు తమ అధికారిక వెబ్‌సైట్లు “.com” లేదా “.co.in” డొమైన్ల నుంచి ప్రత్యేకంగా “.bank.in” డొమైన్‌కు మార్చాయి. దీని ద్వారా కస్టమర్‌ల డేటా భద్రతతో పాటు మోసాలను అరికట్టాలని రిజర్వు బ్యాంక్ చూస్తోంది.​

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఆదేశాల మేరకు అక్టోబర్ 31, 2025నాటికి అన్ని బ్యాంకులు తమ ఇంటర్మెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లను “.bank.in” డొమైన్లకు మార్చాలి. ఈ మార్పు ప్రధానంగా ఫిషింగ్, నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా జరగుతున్న మోసాలను నియంత్రించేందుకు తీసుకున్న చర్య. కస్టమర్‌లు తప్పు వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసి నష్టపోతున్న ఘటనలు ఎక్కువ కావటంతో నకిలీలకు భిన్నంగా వెబ్ సైట్లను తీర్చిదిద్దుతోంది రిజర్వు బ్యాంక్.​

“.bank.in” డొమైన్ ప్రత్యేకత..

“ .bank.in” డొమైన్ కేవలం RBIకి లోబడి పనిచేసే, అధికారికంగా గుర్తింపు పొందిన బ్యాంకులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఇతర సాధారణ వెబ్‌డొమెయిన్‌ల కంటే ఎక్కువ సెక్యూరిటీని అందిస్తుంది. కాబట్టి ఖాతాదారులు తమ బ్యాంకు వెబ్‌సైట్ “.bank.in” డొమెయిన్‌లో ఉందా లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.

ఉదాహరణకు మారిన బ్యాంక్ డొమైన్ లింక్స్..

ఐసిఐసిఐ బ్యాంక్ : https://www.icici.bank.in/
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : https://sbi.bank.in/

2025 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మోసాల కేసులు తగ్గాయి కానీ మొత్తం నష్టం మూడు రెట్లు పెరిగింది. మోసం ఎక్కువగా ప్రైవేట్ బ్యాంకుల్లో కేసుల రూపంలో వచ్చినప్పటికీ.. ప్రభుత్వ రంగంలో మొత్తం నష్టం ఎక్కువగా ఉంది. దీంతో RBI మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చింది.​కస్టమర్లు ఇకపై బ్యాంక్ వెబ్‌సైట్‌లో లాగిన్ చేయడానికి ముందుగా “.bank.in” డొమైన్ పరిశీలించాలి. అధికారిక మెసేజ్, ఇమెయిల్ ద్వారా వచ్చిన లింక్ “.bank.in”తో ముగిస్తే అది విశ్వసనీయమైనదిగా భావించవచ్చు.​మెుత్తానికి నూతన మార్పుతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ మరింత సురక్షితంగా మారనుందని నిపుణులు అంటున్నారు. 

►ALSO READ | ఇదేం ఖర్మరా బాబూ : ద్రవ్యోల్బణం తగ్గినా ప్రజలకు ఖర్చులు తగ్గట్లే.. ఎందుకంటే..?