Crypto: బిట్‌కాయిన్ ధమాకా.. తొలిసారి లక్ష 11వేల డాలర్లు క్లాస్.. నెక్స్ట్ ఏంటి..?

Crypto: బిట్‌కాయిన్ ధమాకా.. తొలిసారి లక్ష 11వేల డాలర్లు క్లాస్.. నెక్స్ట్ ఏంటి..?

Bitcoin Rally: ఆర్థిక వ్యవస్థలో ఒక డీసెంట్రలైజ్డ్ పెట్టుబడి సాధనంగా క్రిప్టో కరెన్సీలు ప్రస్తుతం తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాయి. అయితే ఇది కేవలం హైప్ కోసం చెబుతున్న విషయం కాదు ప్రపంచ వ్యాప్తంగా వాటికి క్రమంగా పెరుగుతున్న ఇన్వెస్టర్ల డిమాండ్ దీనిని నిరూపిస్తోంది. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థల్లో అస్థిరతలు కొనసాగుతున్న ప్రస్తుత కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఒకపక్క పతనాన్ని చూస్తున్నప్పటికీ బిట్ కాయిన్ లాంటి క్రిప్టో ఆస్తులు మాత్రం భారీగా ర్యాలీని నమోదు చేస్తున్నాయి. 

గడచిన నాలుగు నెలల కాలం నుంచి కన్సాలిడేషన్ ఫేజ్ చూసిన బిట్ కాయిన్ నేడు తన సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకుని ఇన్వెస్టర్ల మతిపోగొడుతోంది. దీంతో ఇన్వెస్టర్లపై డబ్బుల వర్షం కురుస్తోంది. వాస్తవానికి కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థలు మందగించిన కాలంలో దాదాపు 60వేల డాలర్ల మార్కు వద్ద ట్రేడింగ్ చేసిన బిట్ కాయిన్ ప్రస్తుతం దాదాపు రెండింతలైంది. ఇక్కడ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహంతో పాటు రిస్క్ తీసుకునే మూడ్ కలిగి ఉంటే ఖచ్చితంగా రాబడిని పొందుతారు అనే విషయం మరోసారి నిరూపితమైంది. 

Also Read : రూ.కోటి ఖరీదైన ఇంటిని ఇలా అప్పుచేసి కొంటే రూ.50 లక్షలు లాభం

నేడు ఇంట్రాడేలో బిట్ కాయిన్ ధర ఇంట్రాడేలో ఏకంగా లక్ష 11వేల డాలర్ల మార్కును అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ కలిగిన క్రిప్టో కరెన్సీగా తన సత్తాను చాటింది. దీంతో బిట్ కాయిల్ మెుత్తం మార్కెట్ క్యాప్ 2.21 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. దీంతో ప్రస్తుతం బిట్ కాయిన్ తన గత అన్ని రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను లిఖించిందని కాయిన్ స్విచ్ సహ వ్యవస్థాపకులు ఆశిష్ సింఘాల్ పేర్కొన్నారు. ఇది గ్లోబల్ మార్కెట్లలో క్రిప్టోలు ఎలా సరికొత్త డిజిటల్ అసెట్ పాత్రలో ముందుకు సాగుతున్నాయో వెల్లడిస్తోందని ఆయన అన్నారు. 

ఈ క్రమంలో టాప్10 క్రిప్టోలు కాకుండా మిగిలిన ఆల్ట్ కాయిన్స్ కూడా బులిష్ మెుమెంటం కలిగి ఉన్నాయని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ పేర్కొన్నారు. ఇవి 15 శాతం వరకు నేడు పెరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బిట్ కాయిన్ తన గత రికార్డులను తానే బద్ధలు కొట్టి మరోసారి గ్లోబల్ స్థాయిలో నమ్మదగిన పెట్టుబడిగా నిరూపించుకుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బిట్ కాయిన్ తిరిగి లక్ష 7వేల స్థాయికి తిరిగి రావొచ్చని ఆ తర్వాత తిరిగి ర్యాలీ స్టార్ట్ చేయెుచ్చని సుబ్బురాజ్ అన్నారు. 

ఈ ఏడాది జనవరిలో గరిష్ఠాలను తాకిన బిట్ కాయిన్ ప్రస్తుతం నాలుగు నెలల కాలంలోనే మరో సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకోవటం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్లను బలపరుస్తోందని ముద్రాక్స్ సీఈవో ఇదుల్ పటేల్ అన్నారు. అసలు బిట్ కాయిల్ ధరలు పెరగటానికి అమెరికాలో కొనసాగుతున్న రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ తో పాటు ఈటీఎప్ ఉత్పత్తులను రెగ్యులేట్ చేయటమే కారణంగా బైయూకాయిన్ సీఈవో శివం థక్రాల్ అన్నారు. సంస్థాగత పెట్టుబడులు పెరగటం కూడా దీనికి కారణంగా ఆయన పేర్కొన్నారు. అయితే రానున్న కాలంలో ఇది లక్ష 15వేల మార్కు దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని డెల్టా ఎక్స్ఛేంజ్ సీఈవో పంకజ్ బలాని అభిప్రాయాన్ని పంచుకున్నారు.