సుందరం మాస్టర్ మూవీ రిలీజ్ అనౌన్స్

సుందరం మాస్టర్ మూవీ రిలీజ్ అనౌన్స్

హ‌‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద లీడ్ రోల్స్‌‌లో క‌‌ళ్యాణ్ సంతోష్ దర్శక‌‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. హీరో ర‌‌వితేజ‌‌, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌టైన్ చేయగా, న్యూఇయర్ సందర్భంగా స్పెషల్ వీడియోతో మూవీ రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. ఇందులోని కొన్ని పాత్రలను అటెండెన్స్‌‌ ద్వారా పరిచయం చేస్తూ సాగిన వీడియో నవ్వులు పూయిస్తోంది. మిగతా అటెండెన్స్‌‌ను ఫిబ్రవరి 16న తీసుకుందాం అంటూ రిలీజ్‌‌ డేట్‌‌ను ప్రకటించారు. 

సుందరం (హర్ష) అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీచర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌‌గా వెళ్లాల్సిన ప‌‌రిస్థితి వ‌‌స్తుంది. అక్కడ అన్ని వ‌‌య‌‌సుల‌‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌‌టానికి విద్యార్థులుగా వ‌‌స్తారు. మ‌‌రి సుంద‌‌రం మాస్టర్ వారికెలా ఇంగ్లీష్‌‌ను బోధించాడు అనే విష‌‌యాన్ని ఎంట‌‌ర్‌‌టైనింగ్‌‌గా రూపొందించిన చిత్రమే ఇది.  శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.