
వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, టీజర్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచిన మేకర్స్.. తాజాగా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో వెంకటేష్, బేబీ సారా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.