HBD Chiyaan Vikram: ఐకానిక్ టాలెంట్ చియాన్ బర్త్డే స్పెషల్..తంగలాన్‌ విక్రమ్ యాక్షన్ ప్యాక్డ్‌ వీడియో రిలీజ్

HBD Chiyaan Vikram: ఐకానిక్ టాలెంట్ చియాన్ బర్త్డే స్పెషల్..తంగలాన్‌ విక్రమ్ యాక్షన్ ప్యాక్డ్‌ వీడియో రిలీజ్

వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో కమల్ హాసన్ తర్వాత చియాన్ విక్రమ్(Chiyyan,Vikram) పేరు గుర్తుకు వస్తుంది. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు.ఆయన ఎంచుకునే సినిమాలతో పాటు.. అందుకు తగ్గట్లు తన లుక్స్‭ను మార్చుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విక్రమ్ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో తన లుక్ కోసమే ఎక్కువ కసరత్తు చేస్తుంటాడు. తన పాత్రకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్‌ అయినా చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.అతని సినిమా కెరీర్లో 60 కి పైగా చిత్రాలలో నటించి..ప్రతి సినిమాతో మెప్పించే విక్రమ్ కి స్పెషల్ బర్త్ డే విషెష్.  

ప్రస్తుతం చియాన్ విక్రమ్ హీరోగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తంగలాన్‌ (Thangalaan) అనే సినిమా చేస్తున్నారు.కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ  (ఏప్రిల్ 17న) బర్త్ డే స్పెషల్ గా తంగలాన్‌ నుంచి విక్రమ్ మేకోవర్ కి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

"తాను ఒక ఐకానిక్ టాలెంట్,గ్రిట్ మరియు గ్లోరీతో ఎల్లప్పుడూ తన నటనతో అంచనాలను మించేలా చేసే చియాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు..తంగలాన్‌ పెద్ద స్క్రీన్‌ పై మీ నరాలు పిక్కటిల్లే ఉనికి కోసం వేచి చూడండి" అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు.

విక్రమ్కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది.ఈ మూవీ జనవరి 26న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.