హనుమాన్ మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్‌‌‌‌

హనుమాన్ మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్‌‌‌‌

‘హనుమాన్’ ఇచ్చిన విజయాన్ని మర్చిపోలేనని అన్నాడు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై .. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌‌‌‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్ ఫుల్‌‌‌‌గా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం ‘హనుమాన్’ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్‌‌‌‌ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో మూవీ టీమ్‌‌‌‌కు  హనుమాన్ ప్రతిమలను జ్ఞాపికలుగా అందించారు.  

ఎంతో గొప్పగా ఆదరించిన  ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పాడు తేజ. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘50 రోజుల పండుగ చూసి చాలా కాలమైంది.  ‘హనుమాన్’ చిత్రం 150 థియేటర్స్‌‌‌‌లో 50 రోజులు ఆడటం  చాలా మందికి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. కొత్తగా వచ్చే వారికి  ఇన్‌‌‌‌స్పైరింగ్‌‌‌‌గా ఉండాలని ఈ వేడుక నిర్వహించాం.  ‘హనుమాన్’ ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా త్వరలో జరగబోతోంది. ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌‌‌కు కూడా పంపబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అవార్డ్స్ వస్తాయనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. తమ బ్యానర్‌‌‌‌‌‌‌‌ నుంచి మరిన్ని మంచి సినిమాలు రాబోతున్నాయని నిర్మాత నిరంజన్ రెడ్డి చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.