అక్టోబర్ 5న ‘ద ఘోస్ట్’

అక్టోబర్ 5న ‘ద ఘోస్ట్’

అతనో    ఇంటర్‌‌‌‌పోల్ ఏజెంట్. నేరస్థులకు చుక్కలు చూపిస్తాడు. దాంతో వాళ్లంతా ఇతనిని మట్టుబెట్టాలని స్కెచ్ వేశారు. ఒకేసారి దాడి చేయాలనుకున్నారు. ఆ విషయం అతనికి తెలిసిపోయింది. అండర్ వరల్డ్ మొత్తం తనను చుట్టుముట్టబోతోందని కబురందింది. అయినా కంగారు పడలేదు. వాళ్లని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. అందుకు అవసరమైన ఆయుధాన్ని తనే సొంతంగా తయారు చేసుకున్నాడు. శత్రువుల్ని చీల్చి చెండాడటానికి చీకట్లో వేచి ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలుసుకోవాలంటే అక్టోబర్ 5న ‘ద ఘోస్ట్’ మూవీ చూడాల్సిందే.

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ ఇది. పైన చెప్పుకున్న సీన్‌‌తో ఓ స్పెషల్ ప్రోమోని కట్‌‌ చేసి నిన్న విడుదల చేశారు. ప్రతి ఫ్రేమ్ డిఫరెంట్‌‌గా ఉంది. ఏజెంట్‌‌గా నాగ్ పవర్‌‌‌‌ఫుల్ లుక్ సూపర్బ్ అనిపించింది. కిల్లింగ్ మెషీన్‌‌గా నాగ్‌‌ను ప్రవీణ్ ఎలా చూపించబోతున్నాడో ఈ ప్రోమో రుచి చూపించింది. ‘తమ హగనే’ అంటే ఏంటి అంటూ కొద్ది రోజులుగా క్యూరియాసిటీని రేపుతున్న ప్రశ్నకి ఈ వీడియోతో జవాబు కూడా దొరికింది. తమ అంటే  విలువైనది. హగనే అంటే ఉక్కు. తన దగ్గరున్న విలువైన ఉక్కుతో నాగ్ తన ఆయుధాన్ని తయారు చేసుకోవడం ప్రోమోలో చూపించారు కదా. దీని గురించే ఇన్ని రోజులూ ఊరించారన్నమాట.