హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు జరిగిన పరీక్షల్లో 13 మందిపై కేసులు నమోదయ్యాయి. దీంట్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన స్టూడెంట్లు 11 మంది ఉండగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులున్నారు.
కాగా, ఫస్టియర్ స్టూడెంట్లకు మ్యాథ్స్– ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన 5,32,683 మంది అంటెండ్ కావాల్సి ఉండగా, 5,09,194 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా తెలిపారు. వివిధ కారణాలతో 23,489 (4.4%) మంది హాజరుకాలేదని చెప్పారు.
