ఓయూ, వెలుగు: అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మాల విద్యార్థుల నిరుద్యోగుల సభ జరగనుంది. సంబంధిత పోస్టర్ ను శనివారం మాల స్టూడెంట్స్ జేఏసీ, ఐక్య విద్యార్థి సంఘాలు, మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ మాయాదేవి, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, బేర బాలకిషన్, చెరుకు రామచందర్, మాదాసు రాహుల్, నామ సైదులు ఆవిష్కరించారు. ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. రోస్టర్ విధానం వల్ల గ్రూప్3లోని మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. రోస్టర్ పాయింట్లను సవరించాలని డిమాండ్ చేశారు.
